![]() |
![]() |
.webp)
కొందరు సెలబ్రిటీలు ఏం చేసిన ట్రెండింగ్ లో ఉంటారు. మరికొందరు సాధారణంగా ఎక్కడికి వెళ్ళిన వైరల్ న్యూస్ గా మారుతుంటారు. కజకిస్తాన్ లో అశ్వినిశ్రీ, కులుమనాలిలో కీర్తిభట్, దుబాయ్ లో అనిల్ జీలా, థాయ్ లాండ్ లో శ్రీముఖి.. ఇలా కొంతమంది కొన్ని విదేశీ ట్రావెల్స్ చేసినప్పుడు వారు చేసిన వ్లాగ్స్ ట్రెండింగ్ లోకి వెళ్తాయి. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్స్ లలో ఇనయా, శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్, గీతు రాయల్, ఫైమా, ఆదిరెడ్డి రెగ్యులర్ గా రీల్స్, పోస్ట్, వ్లాగ్స్ అంటూ ఏదో ఒక సోషల్ మీడియా వేదికలో కన్పిస్తూనే ఉన్నారు. కాగా ఇప్పుడు ఈ జాబితాలోకి పింకీ చేరింది.
పింకి అలియాస్ సుదీప.. బిగ్ బాస్ సీజన్ -6 తో అందరికి సుపరిచితమైన నటి. అంతకముందు 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ కి చెల్లి పింకీగా చేసి మంచి పేరు తెచ్చుకుంది. అప్పటినుండి అందరూ ఆ సినిమాలో చేసిన పింకి కదా అని తనని అనేవారంట. దాంతో తన పేరుని సుదీప పింకీ అని మార్చేసుకుంది. బిగ్ బాస్ లోకి వెళ్ళాక అక్కడ ఎక్కువ సమయం కిచెన్ లోనే గడిపిన సుదీపని అందరూ ఒక అమ్మగా చూసేవారే తప్ప.. తోటి కంటెస్టెంట్ గా ఎవరూ చూసేవారు కాదు. హౌస్ లో బాలదిత్య, చలాకీ చంటి, ఫైమాలతో ఎక్కువ సమయం గడిపిన సుదీప.. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు ఎప్పుడు చూసిన పని పని అంటూ గడిపిన సుదీప.. బయటకొచ్చాక ఫ్యామిలీతో గడుపుతూ ఎంజాయ్ చేస్తుంది.
అయితే బిగ్ బాస్ సీజన్-6 తర్వాత ఇంట్లోనే ఫ్యామిలీతో గడుపుతూ బిజీగా ఉంటున్న పింకి అలియాస్ సుదీప.. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒమన్ వెళ్ళినట్టుగా చెప్పింది. అక్కడ ఎడారిలో ఓ ఫోటో షూట్ ప్లాన్ చేయగా డిఫరెంట్ గా ఓ క్యాప్ పెట్టుకొని కన్పిస్తుంది. ఇక ఈ ఫోటోలని తన అకౌంట్ లో చూసిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో బాల ఆదిత్య, రాజ్, ఫైమాలతో ఎక్కువగా ఉన్న సుదీప బయటకొచ్చాక నేహా పెళ్ళికి కలిసింది. ఆ తర్వాత కీర్తి భట్ ఎంగేజ్ మెంట్ లో అందరితో కలిసి రీల్స్ చేసింది. ఇక ఇప్పుడు తన భర్తతో కలిసి ఫారెన్ లో ఉంటున్న సుదీప.. ఎడారిలో దిగిన కొన్ని ఫోటోలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. కాగా ఇప్పుడు సుదీప ట్రెండింగ్ లోకి వచ్చేసింది.
![]() |
![]() |